జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే … రీజన్ అదేనా

 

TDP MLA to meet Jagan ... Reason is that,jagan,ys jagan.ys jagan mohan reddy,chandrababu,chandrababu naidu,nchandrababu naidu,trendingandhraజగన్ పై దాడి ఘటనతో ఒక కొత్త రకం రాజకీయం స్టార్ట్ అయ్యింది. ఏపీరాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు కు సొంత పార్టీ నేతలు షాకుల మీద సాకులు ఇస్తున్నారు. జగన్ పై దాడికి సానుభూతి పేరుతో కొందరు టీడీపీ నాయకులు సందట్లో సడేమియా అంటూ మూటా ముల్లె సర్దుకుని వైసీపీ పంచన చేరేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇక తాజాగా జ‌గ‌న్ దాడి పై జగన్ డ్రామాలాడుతున్నాడని చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌న‌స్థాపం చెందిన తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు రామారెడ్డి చంద్రబాబుకు షాక్ ఇస్తూ త‌న ప‌ద‌వికి టీడీపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. రాజీనామా చేసిన తార్వాత మీడియాతో మాట్లాడిన రామారెడ్డి చంద్ర‌బాబును నానా దుర్భాషలాడారు. కానీ అసలు విషయం గత కొంత కాలంగా వైసీపీ వంక చూస్తున్న ఆయన సమయం దొరకటంతో ఈ సానుభూతి పేరుతో జగన్ దగ్గర మార్కులు కొట్టెయ్యొచ్చు అని భావించి రాజీనామా చేశారు. అందులో భాగంగానే ప్రెస్ మీట్ పెట్టి బాబును ఏకిపారేసినట్లు బిల్డప్ ఇచ్చి వైసీపీకి జంప్ అయ్యారు.
దీంతో షాక్ తిన్న చంద్ర‌బాబుకు వైసీపీ నుండి టీడీపీకి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే కూడా మ‌రో షాక్ ఇచ్చాడు. జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన త‌ర్వాత వై సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే గుర్నాథ‌రెడ్డి లోట‌స్ పాండ్ లో జ‌గ‌న్ నివాసానికి వెళ్ళి మ‌రీ ప‌ల‌క‌రించాడ‌ని స‌మాచారం. గుర్నాథ రెడ్డి విషయంలో కూడా చంద్రబాబు అంత సానుకూల దృష్టితో లేరు. దీంతో గుర్నాథ‌రెడ్డి కి జగన్ పై దాడి ఘటనతో తాను మళ్ళీ జగన్ కు దగ్గరయ్యే అవకాశం వచ్చింది. అందుకే జగన్ దగ్గరకు వెళ్లి మరీ కలిసొచ్చారు. ఈ వ్య‌వ‌హారం టీడీపీలో క‌ల‌క‌లం రేపగా చంద్ర‌బాబుకు మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. జగన్ పై జరిగిన దాడి ఘటన అసహనంతో ఉన్న పార్టీ మారాలని చూస్తున్న వారికి ఒక సాకులా దొరికింది.