ఇంటర్నెట్ షట్ డౌన్.. భారతీయులకు మరో శుభవార్త…!

 

మనదేశం లో గత రెండు రోజులనుండి ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది . అదేమిటంటే మరో 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయని నిన్నటి నుంచి వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. నిర్వహణలో భాగంగా ప్రధాన డొమైన్ సర్వర్లు, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను కొంతసేపు నిలిపివేయనున్నట్టు రష్యా ప్రకటించింది. ఇంటర్నెట్ వినియోగదారులనెట్‌వర్క్ కనెక్షన్ ఫెయిలయ్యే అవకాశం ఉందని తెలిపింది. డొమైన్ నేమ్ సిస్టంకు మరింత భద్రత కల్పించే చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది.

ప్రస్తుత రోజుల్లో ప్రపంచం లో పెరుగుతున్న సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఇటువంటి చర్యలు అవసరమని చెప్పుకొచ్చింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా అప్పుడే గుబులు మొదలైంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం నడిచేది ఒక్క ఇంటర్ నెట్ తోనే , అదే ఆగిపోతే చాలా కష్టం అవుతుంది . తాజాగా, నేడు కూడా రష్యా మరోమారు ఇంటర్నెట్ షట్‌డౌన్‌పై ఒక ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇంటర్నెట్‌పైనే నడుస్తుండడంతో రష్యా ప్రకటన కొంత గుబులు పుట్టించింది. అయితే, ఈ విషయంలో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ గుల్షన్ రాయ్ చెప్పుకొచ్చారు .

ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని, మీడియాలో వస్తున్నట్టు భారత్‌లో ఇంటర్నెట్‌కు ఎటువంటి అవాంతరాలు ఉండవు అని చెప్పారు . నిర్వహణ చర్యలు చేపడుతున్న ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్‌డ్ నేమ్స్ అండ్ నంబర్స్ ఇంటర్నెట్ షట్‌డౌన్ వార్తలపై స్పందించింది. దురదృష్టవశాత్తు ఈ వార్తలకు మీడియాలో పెద్ద ఎత్తున ప్రాధాన్యం లభించిందని, అయితే, నిర్వహణ పనుల వల్ల యూజర్లకు పెద్దగా సమస్యలు ఎదురుకావని, కొంతసమయం మాత్రమే చిన్నచిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది . భారతీయులకు ఇది నిజంగా శుభవార్తే .