2. 0″ ట్రైలర్….ఐ విల్ సెట్ యువర్ స్క్రీన్స్ ఆన్ ఫైర్..!

2.0 trailer launch Live updates,rajinikanth,rajinikanth 2.0 trailer launch Live updates,Rajinikanth and Akshay Kumar latest movie,trendingandhra

భారతదేశ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా… అందరినీ అలరించబోతున్న విజువల్ వండర్ చిత్రం ‘2 పాయింట్ 0’. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ కీలకపాత్రల్లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ ఎట్టకేలకు పూర్తి కావచ్చాయి. దాదాపు 400 కోట్లతో నిర్మస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. దీంతో ఇప్పటినుంచే దర్శకుడు శంకర్ ప్రమోషన్ డోస్ పెంచేస్తున్నాడు.

తాజాగా సినిమాకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, పలువురు సినీ ప్రముఖుల మధ్య ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘సెల్ ఫోన్ వాడుతున్న ప్రతిఒక్కరూ హంతకులే.., ఐ విల్ సెట్ యువర్ స్క్రీన్స్ ఆన్ ఫైర్’ అనే డైలాగులు బాగున్నాయి. ట్రైలర్ లో శంకర్ మార్క్ సన్నివేశాలతో పాటు హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకుల్ని కట్టిపడేసే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.

ఈ వేడుకకి దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్, సంగీత దర్శకుడు రెహ్మాన్ తో పాటు హీరోయిన్ చిత్రబృందం పాల్గొన్నారు. రజినీకాంత్ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నైలోని సత్యం సినిమాస్ లో ఈ ఈవెంట్ చోటుచేసుకుంటుంది. ట్రైలర్ ని 4డీ సౌండ్ టెక్నాలజీతో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈ టెక్నాలజీతో ఏ ఇండియన్ సినిమా విడుదల కాలేదు.