నాని కోసం రెండు ప్రాజెక్టులు సిద్ధం..!

ప్రస్తుతం టాలీవుడ్ హీరో నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

ఈ సినిమా తరువాత నాని ఏ దర్శకుడితో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో విక్రమ్ కుమార్ హను రాఘవపూడి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

నాని కోసం ఒక వైపున విక్రమ్ కుమార్ మరో వైపున హను రాఘవపూడి స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారట. ఎప్పటికప్పుడు కథా చర్చలు జరుపుతూ, మార్పులు చేర్పులు చేసుకుంటున్నారట.

ఈ ఏడాది ఈ ఇద్దరి దర్శకులతో నాని చేయడమనేది ఖాయమైపోయింది. అయితే ఇద్దరి దర్శకులలో ఎవరి సినిమా ముందుగా సెట్స్ పైకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.