2019 ఎన్నికల్లో బీజేపీ కి షాక్-తాజా సర్వే…

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కి ప్రజలు షాక్ ఇవ్వనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అది నిజం చేస్తూ
బీజేపీ కనీస మెజారిటీకి 50 సీట్ల దూరంలో ఆగిపోనుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. బీజేపీకి 227 సీట్లు, కాంగ్రె్‌సకు 78 సీట్లు, మిగిలిన పార్టీలన్నింటికీ కలిపి 238 సీట్లు వస్తాయని అంచనా వేసింది. వార్‌ రూం స్ట్రాటజీస్‌ అండ్‌ ఉటోపియా అనే సంస్థ తాజాగా ఈ సర్వేను చేసింది. అయితే ఓ న్యూస్‌ చానెల్‌ ఇచ్చిన తాజా సర్వే ప్రకారం యూపీ, బిహార్‌, గుజరాత్‌, రాజస్థాన్‌లలో ఇతర పార్టీలు కోలుకోవడంతో బీజేపీకి 50 సీట్లు తగ్గుతాయని తేల్చింది.

తాజా సర్వే ప్రకారమే ఎన్నికల్లో ఫలితాలు వస్తే కొత్త మిత్రులతో బీజేపీ సర్కారు ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని సోమవారం సీ-ఓటర్‌, ఏబీపీ న్యూస్‌ చానెల్‌ సర్వేలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మోదీ హవా కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని సీ-ఓటర్‌ తేల్చిచెప్పింది. చూద్దాం ఎవరు అధికారంలోకి వస్తారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.