బుర్ర కధ వినిపించడానికి రెడీ అవుతున్న ఆది..

తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు కథ అందించిన వ్యక్తి డైమండ్ రత్నం , ఎప్పటినుంచో దర్శకుడు అవ్వాలని అనుకున్నాడు, కాలం కలిసిరాక ఆ ఛాన్స్ రాలేదు. అయితే ఇన్నాళ్లకు ఆయనకు ఒక ఛాన్స్ వచ్చింది. దీనితో “బుర్ర కథ ” వినిపించడం మొదలు పెట్టాడు. బుర్రకథ వినిపించడం ఏమిటి ? అని అనుకుంటున్నారా ? డైమండ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి పెట్టిన పేరు ” బుర్రకథ ” . అదే అసలు విషయం.

ఇక ఈ సినిమాలో సాయి కుమార్ తనయుడిగా తెరంగేట్రం చేసిన ఆది హీరోగా నటించనున్నాడు. వరస ప్లాపులు తో సతమతమవుతున్న ఆది ఇప్పటికి సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు . మరి ఇప్పుడు డైమండ్ రత్నం బుర్రకథ తో హిట్ కొడతాడా ? లేదా ? చూడాలి . అలాగే దర్శకుడిగా మారిన డైమండ్ రత్నం కు కూడా ఈ సినిమా హిట్ కావడం ఎంతో అవసరం. డైరెక్టర్ గా సక్సెస్ అయితేనే పేరు ఉంటుంది లేదంటే రచయితగా కూడా తీసుకోరు అని విశ్లేషకులు అనుకుంటున్నారు.