అదుగో ఫస్ట్ లుక్ విడుదల

అదుగో ఫస్ట్ లుక్ విడుదల

Rravi babu

రొటీన్ సినిమాలకు బిన్నంగా సినిమాలు తీస్తాడు రవి బాబు. ఈయన  పంది పిల్ల పై ‘అదుగో’ అనే సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైన గ్రాఫిక్స్ వ‌ర్క్ వ‌ల‌న సినిమా రిలీజ్‌కి చాలా టైం పటింది. అయితే ఆ మ‌ధ్య ప‌లు సంద‌ర్భాల‌లో పందిపిల్ల‌తోనే బ‌య‌ట క‌నిపించిన ర‌విబాబు, పందిపిల్లను వీపుపై కూర్చోబెట్టుకుని పుషప్స్ చేస్తున్న వీడియో విడుద‌ల చేశాడు. ఫిట్‌నెస్ కోసం బంటి కూడా వ్యాయామం చేస్తోందని వీడియో పోస్ట్ చేసాడు.

Also Read:——అంతరిక్షం లో వరుణ్ తేజ్ ఫుల్ బిజీ

ravi babu

తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. `హాయ్‌ మై నేమ్ ఈజ్ బంటీ` అంటూ పందిపిల్ల ఫోటోతో విడుద‌లైన ఈ పోస్ట‌ర్ ఆకర్షిస్తుంది. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా ను  విడుద‌ల చేయాల‌ని ర‌విబాబు భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత సురేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు ప‌లు భాష‌ల్లో విడుద‌ల కానుంది.రిలీజ్ తర్వాత చూడాలి మరి బంటీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో .

Also Read:——–అందుకే వాళ్ల కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ లో ప్రతేక్య స్థానం