ఆలస్యం చేయనంటున్న అఖిల్????

ఆలస్యం చేయనంటున్న అఖిల్????

Akhil Akkineni

“అఖిల్ అక్కినేని ” అక్కినేని హీరోలకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ కాదని మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తో “అఖిల్” అనే సినిమా చేసాడు.రిలీజ్ ఐనా టీజర్ లు ప్రోమోలు చూసి అఖిల్ మాస్ హీరో కావడం ఖాయమని అందరు భావించారు కానీ అనుకోకుండా ఈ సినిమా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటి గా నిల్చింది.ఈ సినిమా తరువాత అఖిల్ 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని విక్రమ్ కే కుమార్ తో  రెండవ సినిమా ‘హలో’ చేసాడు.ఈ సినిమా తో కాస్త పర్వాలేదు అనిపించాడు. అయినా కూడా అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయారు. ప్రస్తుతం మూడవ సినిమాను “తొలి ప్రేమ” దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న అఖిల్ మూడవ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది.

Also Read:–డార్లింగ్ కోసం ౩ ఏళ్లుగా ఎదురుచూస్తున “జిల్” డైరెక్టర్..!

Akhil Akkineni

2015 లో అఖిల్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన అప్పటికి కేవలం 2 సినిమాలే చేసాడు.అయితే ఇకపై వరుసగా చిత్రాలను చేయాలని అఖిల్ నిర్ణయించుకున్నాడు. సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అఖిల్ మూడవ సినిమా సెట్స్ మీద  ఉండగానే నాల్గవ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Also Read:—-ఓనమ్ గురించి మీకు తెలియని నిజాలు …!

Akhil Akkineni

అఖిల్ నాల్గవ సినిమాకు మలుపు వంటి ఇంటరెస్టింగ్ సినిమా తీసిన  సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించేందుకు రెడీ అయ్యాడు. ఇక అఖిల్ అయిదవ సినిమాకు కూడా కథ సిద్దం అయ్యిందని తెలుస్తోంది. అఖిల్ అయిదవ సినిమాను కొత్త దర్శకుడితో చేయబోతున్నాడు. నిర్మాత ఎవరు అనే విషయంలో కూడా త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది అఖిల్ రెండు చిత్రాలను విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నాడు. మరి చూడాలి అఖిల్ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందో లేదో…