దేవదాసు మనవడు .. మన్మథుడికి వారసుడు….దుమ్ములేపాడుగా ….

Akhil,Akhil Akkineni ,TrendingAndhra

అఖిల్ మూడో చిత్రంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ రూపొందుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది . కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. 49 సెకన్ల వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. ఒక సాంగ్ బిట్ .. ఒక డైలాగ్ పై ఈ వీడియో ను కట్ చేసారు అని తెలుస్తుంది .

“దేవదాసు మనవడు .. మన్మథుడికి వారసుడు .. కావ్యములో కాముడు .. అంతకన్నా రసికుడు .. “అంటూ ఈ సాంగ్ సాగుతోంది. “దేన్నయితే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు” అనే అఖిల్ డైలాగ్ ఈ వీడియోలో చోటు చేసుకుంది.

ఈ సినిమాలో అఖిల్ పూర్తిగా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు . కొత్త లుక్ తో కనిపిస్తూ అఖిల్ ఆకట్టుకుంటున్నాడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను జనవరి 26వ తేదీన విడుదల చేసే అవకాశం వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ లుక్ తో నే మరో మన్మధుడంటూ అందరు అఖిల్ ని ఆకాశానికెత్తేస్తున్నారు .