ప్రేమతో నా రాణి…..భార్య కి స్పెషల్ విషెష్ చెప్పిన బన్నీ …!

ఈ మధ్యకాలంలో తమ తమ షూటింగులతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉంటున్నారు స్టార్ హీరోలంతా. అందులో ముఖ్యంగా చెప్పుకుంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరే ముందుంటుంది. తనకు, తన ఫ్యామిలీకి సంబందించిన ప్రత్యేక సందర్భాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు బన్నీ.
allu arjun, sneha reddy, TrendingAndhra
ఈ రోజు బన్నీ సతీమణి స్నేహారెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన సతీమణికి స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు బన్నీ. ‘‘హ్యాపీ బర్త్ డే క్యూటీ..’’ అని చెబుతూ ‘ప్రేమతో నా రాణి’ అని పేర్కొన్నాడు. దీంతో పాటు దంపతులిద్దరూ కలిసి దిగిన ఓ పిక్ పంచుకున్నాడు. ఈ ట్వీట్ చూసిన మెగా అభిమానులు స్నేహారెడ్డికి వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Allu arjun, Sneha Reddy, TrendingAndhra
కాస్త తీరిక దొరికిందంటే చాలు తన ఫ్యామిలీతో, పిల్లలతో సరదాగా గడుపుతుంటాడు బన్నీ. సినీ కెరీర్‌తో పాటుగా తన ఫ్యామిలీ మెంబెర్స్‌కి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ.. అందరితో సరదాగా గడపడం ఈ స్టైలిష్ స్టార్ స్టైల్. ఇటీవలే ‘నా పేరు సూర్య’ సినిమాతో అలరించిన బన్నీ.. తన తర్వాతి సినిమాను ఇంకా ప్రకటించలేదు. అయితే విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బన్నీ కొత్త సినిమా రాబోతోందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.