అల్లు అర్జున్ కొత్త మూవీ డైరెక్టర్ ఇతనే….

వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు అల్లు అర్జున్. ‘నా పేరు సూర్య’ పరాజయం అవడంతో కొంత గ్యాప్ తీసుకొని మంచి కదా కోసం ఎదురు చూస్తున్నాడు అర్జున్. ఈ సారి చేసే సినిమా తప్పకుండా హిట్ అవ్వాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి విక్రమ్ కుమార్ ఒక కథ చెప్పాడంట. ఫస్టాఫ్ వరకు ఈ కదా ఫై బన్నీ సంతృప్తిని వ్యక్తం చేశాడు .. సెకండాఫ్ విషయంలో విక్రమ్ కుమార్ ఒప్పించలేకపోతే ఆ సినిమా ఉండదనే టాక్ వినిపించింది.

ఒక వైపున విక్రమ్ కుమార్ సెకండాఫ్ పై కసరత్తు చేస్తుండగానే, త్రివిక్రమ్ తో చేయాలనే ఉద్దేశంతో బన్నీ ఉన్నాడనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బన్నీ తదుపరి సినిమా విక్రమ్ కుమార్ తోనే తాజా సమాచారం.విక్రమ్ కుమార్ సెకండాఫ్ చెప్పి బన్నీని ఒప్పించాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని, ప్రస్తుతం కథానాయికల అన్వేషణలో ఉన్నారని చెప్పారు. త్వరలోనే కథానాయికల పేర్లను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ ను తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.