అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల అయింది. ర‌వితేజ‌, ఇలియానా ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు. ఈ ఫ‌స్ట్ లుక్ లో హీరో పాత్ర‌ను మూడు భిన్న‌మైన గెట‌ప్స్ లో చూపించారు. ఫ‌స్ట్ లుక్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. త‌న కెరీర్ లో తొలిసారి ర‌వితేజ  ౩ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీనువైట్ల త‌న గ‌త సినిమాల‌కు పూర్తిభిన్నంగా.స‌రికొత్త జోన‌ర్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు .

Amar Akbar Anthony First Look,trendingandhra
ఈ చిత్రంలో సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌ఘుబాబు, త‌రుణ్ అరోరా, అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్ లో జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ లో షూటింగ్ పూర్తి కానుంది. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల‌తో ఊపు మీద ఉన్న మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 5న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ విడుద‌ల కానుంది అని సమాచారం.