పెళ్ళికి సిద్దమయిన మరో స్టార్ హీరోయిన్ !

మదరాసిపట్నం, ‘ఐ’ చిత్రాలతో సౌతిండియా ప్రేక్షకులకు దగ్గరైన బ్రిటీష్ భామ ఎమీ జాక్సన్ ఈ ఏడాది ఆఖర్లోనే పెళ్లిపీటలెక్కబోతుందనే వార్త వినిపిస్తోంది. ఈ బక్కపలచభామ తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పనయోటౌతో ప్రస్తుతం డేటింగ్‌ చేస్తోంది.
ఎట్టకేలకు ఎమీ-జార్జ్ తమ పెళ్లి గురించి ఓ ప్లాన్ వేసుకుంటున్నారు. పెళ్లి తేదీ, వేదికను ఖరారు చేసే పనిలో వారిద్దరూ ఉన్నారట. బ్రిటీష్ స్థిరాస్తి వ్యాపారి ఆండ్రియాస్ పనయోటౌ కుమారుడే జార్జ్. వీరికి విలాసవంతమైన హోటళ్ల వ్యాపారముంది.
ఎమీ జాక్సన్ ప్రస్తుతం టీవీ సిరీస్ ‘సూపర్ గర్ల్’ షూటింగ్‌లో బిజీగా ఉంది. శంకర్ దర్శకత్వంలో ఆమె నటించిన రోబో 2.0 చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశముంది. మరోవైపు బాలీవుడ్‌లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న రాధే చిత్రంలో ఎమీ హీరోయిన్‌గా నటించే అవకాశముందని బీ-టౌన్ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి 2017 సంవత్సరంలోనే వీరి వివాహ వేడుక జరుగాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల అప్పుడు వీలు కాలేదు. అపుడు అమీ జాక్సన్ 2.0 షూటింగులో బిజీగా ఉండటం కూడా ఓ కారణం. ఈ ఏడాది మంచి టైమ్ చూసుకుని ఇద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారు. బ్రిటన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అండ్రియాస్ పనయిటూ కుమారుడు. వీరి ఫ్యామిలీకి విలాసవంతమైన హోటళ్లను నడిపే వ్యాపారం కూడా ఉంది. ది ఎబిలిటి గ్రూప్ అనే సంస్థకు జార్జ్ అధినేతగా వ్యవహరిస్తున్నారు.
అమీ జాక్సన్ నటించి ‘2.0’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ చిత్రంలో ఆమె లేడీ రోబోగా కనిపించనుంది. దీంతో పాటు ఆమె నటిస్తున్న కన్నడ మూవీ’ది విలన్’ చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.