మరోసారి ఐటెం లేడీగా మారిపోయిన అనసూయ

anasuya latest film news,trendingandhra

అనసూయ జబర్దస్త్ తో తెలుగు లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. యూత్ మొత్తం అనసూయ కోసం ఎగబడతారు. క్షణం చిత్రంలో అనసూయ పాత్రకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇక రంగమ్మత్త గా అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈమె విన్నర్ సినిమాలో సాయిధరమ్ తేజ్ కి జోడి గా ఒక ఐటెం సాంగ్ లో ఆడిపాడింది అనసూయ. ఇప్పుడు మరో సారి ఆడటానికి రెడీ అయ్యింది ఈ జబర్దస్త్ హాట్ బ్యూటీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సినిమా రూపొందుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా చేస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అనసూయ మెరవనున్నట్టు తెలుస్తోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. అనసూయలపై ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడిగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా, నాన్ స్టాప్ నవ్వులతో కొనసాగుతుందని చెబుతున్నారు. అనిల్ రావిపూడి వరుస హిట్లు కొడుతుండటంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.