మల్లి పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్ భర్త…

తెలుగు ఇండస్ట్రీ లో యాంకర్ మరియు నటులుగా పరిచయం అయినవారు ఝాన్సీ, జోగి నాయుడు. జోగి నాయుడు నటుడిగానే కాకుండా బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా చేసి ఫేమస్ అయ్యాడు. అప్పుడే యాంకర్ ఝాన్సీ తో పరిచయమై అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయారు. అయితే ఇప్పుడు జోగి నాయుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా సౌజన్య అనే యువతి ని రెండో వివాహం చేసుకున్నాడు.

జోగి నాయుడు అనేక చిత్రాల్లో నటించడమే కాకుండా, యాంకర్ గా కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే అయన వైవాహిక జీవితంలో కలిగిన కొన్ని ఇబ్బందులు కారణంగా ఇటు యాంకర్ గా అటు నటుడిగా తన కెరీర్ మందగించింది . ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడంతో కొత్త ఉత్సాహంతో ఉన్నాడు జోగి నాయుడు. మరి ఈ రెండో పెళ్లి తర్వాత ఆయన తన కేరీర్ ఉపందుకుంటుందో చూడాలి..