తెలుగు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ….

telangana, another party , trendingandhra

రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, యువతకు ఉపాధి, తదితర అంశాలే లక్ష్యంగా యునైటెడ్‌ ఇండియా పార్టీని ఏర్పాటుచేయడం జరిగిందని పార్టీ అధ్యక్షుడు రాజేష్‌ తెలిపారు. సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ప్రతినిధులు మస్తాన్‌, తిరుపతితో కలిసి మాట్లాడారు. పది అంశాలపైన తాము పోరాటం చేయనున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేస్తామన్నారు. మహిళలకు 50శాతం సీట్లను కేటాయిస్తామన్నారు.

జీఎస్టీని తాము అధికారంలో వస్తే ఎత్తివేస్తామన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకు స్కాలర్‌ షి్‌పలు అందజేస్తామన్నారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరికీ 2వేల రూపాయలు పెన్షన్‌ అందచేస్తామని, 12 సంవత్సరాల వయస్సులోపు వారికి హెల్త్‌కార్డులు అందచేస్తామన్నారు. నగరం ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిందని, నగరానికి ధీటుగా మరో నాలుగు నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో హెల్త్‌ కేర్‌ సెంటర్‌ను, అన్ని నియోజకవర్గాల్లో మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తామన్నారు. ప్రతి 5 కిలోమీటర్లకు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతామని, మరో 5 వైద్య కళాశాలలను ఏర్పాటుచేస్తామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు.