ఎన్టీఆర్ బయోపిక్ లో మరో స్టార్ హీరోయిన్

ntr biopic , trendingandhra

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సిని రాజకీయ జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను చిత్ర యూనిట్ ఈ సినిమాలో చూపించనుంది. ఇప్పటికే ఈ సినిమా సంగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని జనవరిలో విడుదల కావడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాత్రల విషయంలో కొన్ని స్పస్హత వచ్చినా మరికొన్ని మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదంటున్నాయి సిని వర్గాలు. ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్ర పోషించిన రేణుకా చౌదరి పాత్రలో నటించేది ఎవరు అనేది ఇప్పుడు సందేహంగా మారింది. అలాగే ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలకంగా చెప్పుకునే ఇందిరా గాంధి పాత్ర విషయంలో కూడా స్పష్టత ఇంకా రావడం లేదు. ఈ పాత్రకు గాను త్రిష ను తీసుకుంటారని టాలివుడ్ వర్గాలు అంటున్నా తెలుగు హీరోయిన్ నే తీసుకుంటారని మరికొందరు అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
#AnotherstarHeroineInNTRBiopic #NTRBiopic #TrishaKrishnan #Trisha