హీరోయిన్ అనుష్క సినిమా లో హీరో మాధవన్ ….

      
anushka and madhavan movieహీరోయిన్ అనుష్క సినిమా లో హీరో మాధవన్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు .అయితే  అనుష్క మరోసారి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంలో నటించబోతోంది.  మాధవన్‌తో కలిసి ఆమె  నటించబోతున్నఆ చిత్రం వచ్చే  ఏడాది  ఆరంభంలో మొదలు కాబోతోంది.   ఇప్పటికే మాధవన్ హీరో పాత్రల కన్నా సినీమాల్లో  బలమైన  మంచి పాత్రలు  వస్తే మాత్రం ఏ మాత్రం సందేహించకుండా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.   అలాగే తాజాగా నాగచైతన్య హీరో గ వచ్చిన సవ్యసాచి చిత్రంలో కూడా పాత్ర నచ్చటంతో ప్రతినాయకుడిగా నటించి మెప్పించడం జరిగింది.మరో వైపు అనుష్క సైతం వయసు పెరుగుతున్న సినిమా అవకాశాలు మాత్రం ,ఏ మాత్రం తగ్గకుండా వరుసపెట్టి తలుపు తడుతున్నాయి ఆమె బాహుబలి  తరువాత   కూడా భాగమతి సినిమాతో తన మార్క్ కథానాయిక ప్రాధాన్యమున్న  పాత్రలు చేస్తూ ఇంకా ఇండస్ట్రీలో తన  పట్టు ఇంకా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది …    అయితే ఇప్పుడు అనుష్క మరియు మాధవన్ కాంబినేషన్లో వస్తున్న ఈ తాజా చిత్రానికి   “వస్తాడు నా రాజు” అనే చిత్ర ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నాడు.  “థ్రిల్లర్‌ కథతో దక్షిణాదితో పాటు, హిందీలోనూ రూపొందించబోతున్నట్టు   తెలుస్తోంది.  అయితే ఈ సినిమాలో అధిక భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం.            
                                                                                                                                           
   ఈ విషయాన్ని ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ చిత్రానికి కోన వెంకట్‌ కథనందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మాధవన్ సరసన అనుష్క నటించనుంది. 2019లో అమెరికాలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది. సుబ్బరాజు కీలక పాత్ర పోషించనున్నారు.
కొత్త చిత్రానికి అనుష్క కమిట్ కావడంతో అనుష్కకు ఈ యేడాది కూడా పెళ్లిలేనట్టుగానే చెప్పొచ్చు. అయితే, ‘బాహుబలి’ హీరో ప్రభాస్ మాత్రం 2019లో పెళ్లి పీటలెక్కడం ఖాయంగా తెలుస్తోంది