ఆఖరి ప్రయత్నాలలో అనుష్క ….షాక్ లో తెలుగు చిత్ర పరిశ్రమ …!

anushka ,TrendingAndhra

టాలీవుడ్ టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్న అనుష్క మీడియాకు కనిపించి చాలరోజులు అవడంతో ఆమె కు ఏమైంది అంటూ వార్తల హడావిడి మళ్ళీ మొదలు అయింది. ప్రస్తుతం ఈమె తెలుగులో నటిస్తున్న సినిమాలు కూడ ఏమి లేకపోవడంతో ఈమధ్య మళ్ళీ ఈమె పెళ్లి విషయం పై గాసిప్పులు మొదలు అయ్యాయి. అంతేకాదు అనుష్క పెళ్లి గురించి ఆమె తల్లితండ్రుల ఒత్తిడి ఎక్కువైంది అన్న వార్తలు కూడ వచ్చాయి.

ఈ వార్తలు ఇలా కొనసాగుతూ ఉండగానే ఈమె తన శరీర లావు ఇంకా పూర్తిగా తగ్గక పోవడంతో ఈ సమస్య పై ఆస్ట్రేలియా వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు అనుష్క తన వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు ఆస్ట్రేలియాలోని ఒక ప్రముఖ వెయిట్ లాస్ క్లీనిక్ లో కొన్ని రోజులు ఉండి కొన్ని సహజ పద్ధతుల ద్వారా తన బరువును మరింత తగ్గించు కోవడానికి ప్రయత్నించ బోతున్నట్లు తెలుస్తోంది.

అనుష్కకు 37 సంవత్సరాల వయసు రావడంతో ఇప్పుడు ఈ లావు సమస్య గురించి శ్రద్ధ పట్టకపోతే భవిష్యత్తులో ఈ సమస్య తీరే ఆస్కారం లేదు అన్న అభిప్రాయంతో అనుష్క తన సినిమాల విషయం కన్నా తన ఆరోగ్యం గురించే బాగా శ్రద్ధ పడుతున్నట్లు టాక్. ఈకారణాలు వల్ల ఈమె ఈమధ్య తాను కోలీవుడ్ లో నటించడానికి ఒప్పుకున్న రెండు సినిమాలను వదులుకున్నట్లు టాక్.

ఇలా కొనసాగుతూ ఉండగా అనుష్క తన కుటుంబ సభ్యుల సహకారంతో సినిమా నిర్మాణం అదేవిధంగా కొన్ని యోగా సెంటర్స్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు కన్నడ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ ఫిట్ నెస్ బిజినెస్ కు సంబంధించిన జిమ్స్ మన తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య నగరాలలో పెట్టి సక్సస్ అయిన నేపధ్యంలో యోగా టీచర్ గా తన కెరియర్ ను మొదలు పెట్టిన అనుష్క ఆలోచనలు ప్రస్తుతం ఈ యోగ క్లినిక్స్ పై ఉన్నట్లు సమాచారం..