అక్టోబర్ 9 నుంచి దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 9వ తేదీ మంగళవారం నుండి 21వ తేదీ ఆదివారం వరకూ సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. తిరిగి 22వ తేదీ నుంచి పాఠశాలు పునః ప్రారంభించాలని చెప్తూ , సెలవు రోజుల్లో స్కూళ్లు నడపరాదని ,,
ఎవరైనా ఈ నియమాల్ని అతిక్రమిస్తే కఠిన చర్య లు తప్పవని వెల్లడించింది.

కాగా, ఈ సంవత్సరం అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి పర్వదినాలు రానున్నాయి. 21వ తేదీన ఆదివారం రావడంతో, 22న స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది . దీనితో విద్యార్థులకు ఈ సంవత్సరం మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి..