అర‌వింద స‌మేత @ 50

aravinda sametha collection news,trendingandhra
 
త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌న్న ప‌దేళ్ల ఎన్టీఆర్ క‌ల అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌తో తీరింది. ఆదితో మొద‌లు చాలా ఫ్యాక్ష‌న్ డ్రాప్ మూవీస్‌లో ఎన్టీఆర్ న‌టించినా ఇందులో యుద్ధం ఆపడం అనే కాన్సెప్ట్ కాస్త కొత్త‌గా ఉండ‌టంతో వీర రాఘ‌వ‌తో ప‌ర‌వాలేద‌నిపించాడు. 
 
అర‌వింద స‌మేత వీర రాఘ‌వ చిత్రానికి డివైడ్ టాక్ రావ‌డంతో రూ.90 కోట్ల బిజినెస్‌ను రాబ‌డుతుందా..? అన్న అనుమానం కూడా వ‌చ్చింది.  మామూలు రోజుల్లో విడుద‌లైతే ఇది క‌ష్ట‌మే అయ్యేది. ద‌స‌రా సెల‌వులు క‌లిసొచ్చి రూ.95 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి లాభాల‌తో బ‌య‌ట‌ప‌డింది. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ రిలీజ్‌కు ముందు హీరో.. హీరోయిన్‌లు ద‌ర్శ‌క నిర్మాత‌లంద‌రూ ఫ్లాపుల్లో ఉన్నారు. అంద‌రికీ స‌క్సెస్ ఇచ్చిన సినిమా ఇది. 
 
అంత‌కు ముందు తార‌క్ లాస్ట్ మూవీ జ‌య ల‌వ కుశ‌లో హీరో త్రిబుల్ రోల్‌కు, ముఖ్యంగా విల‌న్ పాత్ర‌కు ప్ర‌శంస‌లు వ‌చ్చినా సినిమా 86 కోట్ల‌కు బిజినెస్ జ‌రిగితే రూ.76 కోట్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. ఇక త్రివిక్ర‌మ్, నిర్మాత రాథాకృష్ణ కాంబోలో తెర‌కెక్కిన అజ్ఞాత‌వాసి చిత్రం డిజాస్ట‌ర్ అయింది. అర‌వింద‌తో త్రివిక్ర‌మ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తెలుగులో స‌రైన హిట్‌లేని పూజా హెగ్దేకు తొలి స‌క్సెస్ ఇది. 
 
అయితే, అర‌వింద స‌మేత వీర రాఘ‌వ రిలీజై నేటితో 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప‌లు ఏరియాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కేక్ క‌ట్ చేసి త‌మ అభిమాన హీరో ఎన్టీఆర్ హీరో నినాదాల‌తో హోరెత్తిస్తున్నారు.