అరవిందసమేత 11 రోజుల కలెక్షన్స్ ……రికార్డ్స్ బద్దలే

aravinda sametha collections,aravinda sametha, trendingandhra

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత భారీ వసూళ్లు సాధిస్తూ దసరా బరిలో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే . అక్టోబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన అరవింద సమేత మొత్తం 11జుల్లో 86 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది . రెండు తెలుగు రాష్ట్రాలలోనే 68 కోట్లకు పైగా షేర్ రావడంతో బయ్యర్లు దాదాపుగా పెట్టిన పెట్టుబడి తెచ్చుకున్నారు.

NTR, Aravinda Sametha,Trendingandhra

అయితే ఓవర్ సీస్ లో మాత్రం అరవింద సమేత కొనుక్కున్న వాళ్ళకు లాభాలు వచ్చేలా కనిపించడం లేదు . ఓవర్ సీస్ విషయాన్నీ పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం మంచి వసూళ్లు సాధిస్తున్నాడు ఎన్టీఆర్ . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంతో వరుసగా అయిదో హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా ఇతర పాత్రల్లో జగపతిబాబు , నాగబాబు , ఈశా రెబ్బా , సునీల్ లు నటించారు .