అరవిందసమేత లో ఉన్న ఆ భామ ఎవరు …..!

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘అరవింద సమేత’ చిత్రం వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సరసన కథానాయికలుగా పూజా హెగ్డే – ఈషా రెబ్బా నటించారు. ఈ సినిమాలో కన్నడభామ ‘మేఘశ్రీ’ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించిందనేది తాజా సమాచారం.

Aravinda sametha, Trendingandhra

పలు కన్నడ చిత్రాలతో పాటు ‘ ఓమై గాడ్’.. ‘అనగనగా ఒక చిత్రం’ వంటి తెలుగు సినిమాల్లో ఆమె నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమిటనేది తెలియడం లేదు గానీ, తెలుగులో ఆమె చేసిన పెద్ద సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని చెబుతున్నారు. ఆమెకి సంబంధించిన సన్నివేశాలను ఇటీవలే చిత్రీకరించారట. మేఘశ్రీకి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందనేది చూడాలి మరి.