అరవిందసమేత సక్సెస్ మీట్ …అన్న స్మ్రుతులతో బాలయ్య….ఇదే హైలెట్ సీన్ ….

aravinda sametha , balakrishna , trendingandhra
ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా సక్సెస్ గత రాత్రి శిల్పకళావేదికలో జరిగింది. ఈ వేడుకకు నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డులు అందించారు. చిత్రయూనిట్ అంతా మాట్లాడిన తర్వాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కు అతిథిగా వచ్చిన బాబాయ్ బాలకృష్ణకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు కళ్యాణ్ రామ్ .

aravinda sametha ,trendingandhra

ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ మాములుగా ఈ వేడుకలో నాన్నగారు ఉండాలి. ప్రత్యక్షంగా లేకున్నా ఆయన మనతోనే ఉండి ఉంటారు. నాన్న లేకున్నా తండ్రి హోదాలో వచ్చిన బాబాయ్ బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపాడు. ఆ తరువాత మైకు అందుకున్న బాలకృష్ణ తన మార్క్ డైలాగ్స్ తో అదరగొట్టారు. సినిమాకు పనిచేసిన యూనిట్ అందరిని ప్రశంసించిన బాలయ్య బాబు ఇలాంటి పాత్రలు చేయడం మా వంశం వల్లే అవుతుందని అన్నారు. అన్న హరికృష్ణ గురించి మాట్లాడుతూ అయన ముక్కుసూటితనం.. అనుకున్నది చేసే ధైర్యశాలి అయిన అన్న హరికృష్ణ లాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం నమ్మశక్యంగా లేదు. పైకి మొరటుగా కనిపించినా మనసు వెన్న.. తెలుగు దేశం పార్టీ చైతన్య రధసారధి హరికృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. హిందూపురం నుండి ఎన్నికై ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. అన్న మరణం మాకుటుంబానికి తీరని లోటని హరికృష్ణ మీద తనకున్న మమకారం చూపించారు బాలకృష్ణ. స్పీచ్ లో భాగంగా నటుడిగా జూనియర్ ఎన్.టి.ఆర్, తాను పాత్రకు పరిపూర్ణత తెచ్చే నటులమని చెప్పడం విశేషం.

balakrishna, ntr, trendingandhra

ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు బాలయ్య ఎన్టీఆర్ తో మాట్లాడుతూనే ఉన్నాడు . అలాగే ఎన్టీఆర్ ఏదైనా ఫంక్షన్ కి వస్తే బాడీగార్డ్స్ ఉండేవాళ్ళు ,కానీ ఈ సక్సెస్ మీట్ లో అనుక్షణం బాలకృష్ణకి ఇరువైపులా ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఉంటూ తన బాబాయ్ కి రక్షణ గానిలిచారు . ఇది చూస్తున్న అభిమానులు ఎంతో ఆనందంతో ఉప్పోగిపోయారు ..