వికెట్ల కోసం కష్టపడుతున్న భారత బౌలర్లు…..భళా బంగ్లా …!

asia cup 2018 , india vs bangladesh , trendingandhra

బంగ్లాదేశ్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. లిటన్ దాస్ 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ (52) పూర్తి చేసుకుని జోరు కొనసాగిస్తుండగా, మరో ఓపెనర్ మెహిదీ హసన్ 25 పరుగులతో అతడికి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. కాగా, భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాల బౌలింగ్‌ను బంగ్లా బ్యాట్స్‌మెన్ యథేచ్ఛగా ఆడుకుంటున్నారు.