జగన్ పై దాడి … వైసీపీ టీడీపీ మాటల దాడి

atack on jagan , jagan , trendingandhra

జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి గురించి పోలీసులు దర్యాప్తు చేస్తుంటే వైసీపీ, టీడీపీలు పోస్ట్ మార్టం చేస్తున్నాయి. జగన్ పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తి తో దాడి చేశాడని అసలు అతను ఎవరు ఎందుకు దాడి చేశారు అన్న కోణం లో పోలీసులు విచారణ చేస్తున్నారు అని తెలిసినా సరే అంతలోనే ఈ దాడి ఏపీ ప్రభుత్వమే చేయించింది అని వైసీపీ నేతలు ట్విట్టర్ వేదికగా దాడికి దిగారు. దాడి జరిగిన వెంటనే ట్విట్టర్ లో వైసీపీ పలు అనుమానాలను లేవనెత్తుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది.

jagan , trendingandhra

విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత న్‌జగపై పథకం ప్రకారం దాడి చేసి ఉంటారని ఆ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ విమర్శించిది. ఇదిలా ఉంటే, ఏపీ ప్రభుత్వమే దాడి చేయించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వంవైసీపీ  వాదనను తీవ్రంగా ఖండించింది. జగన్‌పై దాడిని ఖండిస్తున్నామని, ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని అధికార పార్టీ పేర్కొంది.

Jagan-Attack,trendingandhra

ఏపీ ప్రభుత్వానికి జగన్ పై దాడి చేయించాల్సిన ఖర్మ పట్ట లేదని టీడీపీ నేతలు చెప్తున్నారు. దాడిని అందరం ఖండిస్తున్నామని చెప్తున్న టీడీపీ నేతలు అతను ఎందుకలా చేసాడో విచారణ జరుగుతుంది. తొందరపడి మాట్లాడితే ఎలా అని తెలుస్తుంది అని అంటున్నారు . అలాగే ఈ కేసు విషయంలో ఇంకా దర్యాప్తు జరుగుతుండగా ప్రభుత్వమే చేయించింది అన్న అపవాదు వేసి గొడవలకు పాల్పడే కుట్ర అని కూడా టీడీపీ గట్టిగా చెప్తుంది.
మొత్తానికి దాడి జరిగిందో లేదో వెంటనే ప్రభుత్వ కుట్ర అని గొడవ మొదలు పెట్టారు వైసీపీ నేతలు. అక్కడ జగన్ పై దాడి కంటే ఇక్కడ నాయకుల మధ్య మాట దాడులు ఎక్కువయ్యాయి. ఒకపక్క దాడిపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఇలా ఒకరినొకరు దూశించుకోవటం చూసి ప్రజలు వీళ్ళు మారరు అని మాట్లాడుకుంటున్నారు.

#AttackOnJaganYCPLeadersBlamesTDP #YSJagan #TDP