ఆయుష్మాన్ భవ……మరో అద్భుత పథకాన్ని ప్రారంభించిన మోదీ..!

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రజలకు ఉచితంగా వైద్య సాయం అందించే ఆయుష్మాన్ ‘భారత్-జాతీయ ఆరోగ్య పరిరక్షణ’ పథకాన్ని ప్రకటించారు. సెప్టెంబరు 25న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజున ఈ పథకం ప్రారంభం కానుంది.

‘భారత్-జాతీయ ఆరోగ్య పరిరక్షణ’ పథకాన్ని తొలి విడతలో 10 కోట్ల మందికి వర్తించేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. అవసరమైన వైద్య సిబ్బందిని, సదుపాయాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య భారత్ లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుందన్న మోదీ చెప్పారు.

ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే 80 శాతం మందిని గుర్తించారు. ఈ పథకంలో చేరిన ప్రతి ఆసుపత్రిలోనూ రోగులకు సాయం అందించేందుకు ప్రత్యేకంగా ఓ ‘ఆయుష్మాన్ మిత్ర’ అందుబాటులో ఉంటారు.