బి.జయ కన్నుమూత

బి.జయ కన్నుమూత

ba Raju

తెలుగు సినీ దర్శకురాలు, తొలి మహిళా ఎడిటర్‌ బి.జయ(54) గురువారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.
పాత్రికేయురాలిగా తన కెరీర్ ఆరంభించిన జయ..తర్వాత ప్రముఖ సినీ వార పత్రికలో చాల కాలం పనిచేశారు. ప్రస్తుతం సూపర్‌ హిట్‌ అనే సినీ వారపత్రికను నిర్వహిస్తున్నారు.

Also Read:–బుల్లితెర పై మహానటి సంచలనాలు

jaya
దర్శకత్వం మీద ఇష్టం తో 2003లో తొలిసారి చంటిగాడు సినిమాను తీశారు . ఆ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ప్రేమికులు, , సవాల్‌, లవ్లీ..తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన వైశాఖం ఆమె దర్శకత్వంలో విడుదలైన చివరి చిత్రం.

Also Read:—సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న చరణ్???

ఆమె భర్త బి.ఎ. రాజుతో కలిసి పలు చిత్రాలనూ నిర్మించారు. తన సినిమాలకు స్వయంగా తానే ఎడిటింగ్‌ చేసుకుంటారు. ఆమె మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి చెందింది. శుక్రవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.