కౌశల్ ఆర్మీ పై బాబుగోగినేని దండయాత్ర……!

స్వతహాగా హేతువాది అయిన బాబు గోగినేని ముందు నుండే పాపులారిటీ కలవాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బాబు గోగినేని తాజాగా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడం ఎంత సంతోషమో బయటకు రావటం కూడా అంతే సంతోషం అని పేర్కొన్నారు.

బిగ్‌బాస్ హౌస్ అంటే అందరూ రబ్బిష్ చేస్తున్నట్టుగా అదో పిచ్చివాళ్ల స్వర్గం అని అనుకోకూడదని బాబు తెలిపారు. బిగ్‌బాస్ అనేది సైకలాజికల్ ప్రెజర్ కుక్కర్. ఆ ప్రెజర్ కుక్కర్‌లో మనం బతకగలమా.. లేదా? అనేది ఆ షోకి వెళ్లిన ప్రతి ఒక్కరికీ తెలుసుకునే అవకాశం. అక్కడ సరిపడా ఫుడ్ ఉండదు. ఆకలి.. సరిగా నిద్ర ఉండదు.

అక్కడికి వెళ్లిన వాళ్లంతా బరువు తగ్గారు. నేను 5 కేజీలు బరువు తగ్గాను. మగవాళ్లకు ఎమోషన్స్ ఉండవు అంటారు కాబట్టి అది నిరూపించడానికి ఒక నలుగురు వచ్చి ఏడవండి అంటారు బిగ్‌బాస్. ఏడ్చావులే పో అన్నాను నేను. వాళ్లు ఏడవమంటే విపరీతంగా నవ్వొచ్చింది. షోలో నాకు నేనుగా ఉన్నాననే ఫీలింగ్ నాకు.

ఆర్మీస్ తయారయ్యాయి. ఆర్మీ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే భారత సైనిక దళంలో చేరండి… దేశానికి ఉపయోగపడుతుంది. టీవీలో వ్యక్తులను కాపాడుకోవడానికి సైన్యం అనేది చాలా పెద్ద మాట అని బాబు గోగినేని చెప్పారు.