అయ్యో బాలయ్య ….బెంబేలెత్తుతున్న తెలుగు తమ్ముళ్లు ..!

balakrishna election campaign in telangana,trendingandhra

సినిమా వేదికైన , రాజకీయ వేదికైన , నందమూరి బాలకృష్ణ ‘మైక్‌’ అందుకున్నారంటే అంతే సంగతులు . మైక్‌ పనైపోవాల్సిందే , అలాగే వినేవాళ్ళు పనైపోవాల్సిందే. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తరఫున, మహాకూటమి తరఫున ప్రచారంలో బిజీగా వున్న బాలయ్యకు కొన్నిచోట్ల జనం నీరాజనం పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల బాలయ్య షో కి తెలుగు తమ్ముళ్ళే బెదిరిపోతున్నారు. బాలయ్య ప్రసంగమా మజాకానా .

తాను నటించిన సినిమాల్లోని డైలాగులు అలవోకగా వల్లెవేసేస్తుంటారు బాలయ్య. పెద్ద పెద్ద డైలాగుల్ని గుర్తు పెట్టుకోవడమంటే చిన్న విషయం కాదు. కానీ, బాలయ్యకు అది అలవాటైపోయిన వ్యవహారం. తాజాగా నేడు కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో బాలయ్యతో పలుచోట్ల రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగులు ఏర్పాటు చేశారు. ఇంకేముంది, బాలయ్య చెలరేగిపోయారు. దీనితో తెలుగు తమ్ముళ్ళే విసిగిపోయారు.

కొంతమంది బాలయ్య డైలాగులు పేల్చుతోంటే నవ్వు ఆపుకోలేక, పక్కకు వెళ్ళి మరీ నవ్వుకోవాల్సి వచ్చింది. అన్నట్టు, కొన్నిచోట్ల బాలయ్య ప్రసంగాలు వినేందుకు జనం మొగ్గు చూపలేదు. దాంతో బాలయ్య షోలు వెలవెలబోయాయి. ఏ మతానికో, ఏ కులానికో పుట్టిన పార్టీ కాదు, హైద్రాబాద్‌ నడిబొడ్డున పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ బాలయ్య పేల్చిన పంచ్‌ డైలాగ్‌ మాత్రం చాలా గట్టిగా పేలింది అని చెప్పాలి . మరి కొన్ని డైలాగ్స్ ప్లాప్స్ అయ్యాయి .

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ని హెచ్చరించడం, చంద్రబాబుని ఆకాశానికెత్తేయడం, ఇవన్నీ బాలయ్య ప్రసంగాల్లో మామూలేననుకోండి . అది వేరే విషయం. మొత్తమ్మీద, టీడీపీ శ్రేణుల్లో కొంతమందికి బాలయ్య ప్రసంగాలు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుంది . పార్టీ అభాసుపాలైపోతోంది మొర్రో అని మరికొందరు తెలుగు తమ్ముళ్ళు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. బాలయ్య ప్రచారం అంటే ఏమనుకున్నారు మరి