యాచకురాలి వద్ద ఎంత డబ్బుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు ..!

beggar free city hyderabad ,hyderabad beggar free, beggar free hyderabad, beggar free city in india,trendingandhra

చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఆనందాశ్రమంలో కొత్తగా చేరిన ఓ వృద్ధురాలి వద్ద రూ.2.34లక్షల నగదు లభ్యమయ్యాయి. చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ ఎం.ఆర్‌.భాస్కర్‌ ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ను యాచక రహిత నగరంగా రూపొందించేందుకు చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఈనెల 2వ తేదీన జీహెచ్‌ఎంసీ సిబ్బంది మూసారాంబాగ్‌ టీవీ టవర్‌ వద్ద దాడిచేసి కొందరు బిచ్చగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన బిజిలి పెంటమ్మ (72)ను చర్లపల్లి కేంద్ర కారాగారంలోని మహిళల ఆనందాశ్రమానికి శనివారం తరలించారు. పెంటమ్మను విచారించగా ఆమె తన వివరాలను బయటపెట్టింది. అంతే కాకుండా తనవద్ద సంచిలో దాచిపెట్టుకున్న చిన్న చిన్న కవర్లను ఒక్కొక్కటిగా బయటపెట్టింది.

అధికార సిబ్బంది ఆ మొత్తాన్ని లెక్కించగా మొత్తం రూ.2,34,320లుగా తేలింది. భర్త గతంలోనే చనిపోయాడు. ఇద్దరు కొడుకుల్లో ఒకరు చనిపోగా మరో కొడుకు దేశాలు పట్టుకుపోవడంతో కోడళ్ల పంచన చేరింది. తగాదాల మూలంగా ఏడేళ్ల క్రితం ఊర్లో ఉన్న తన ఇంటిని విక్రయించారు. తన వాటాగా వచ్చిన రూ.2లక్షల్లో ఒక లక్ష రూపాయలను కోడళ్లకు, మనుమండ్లకు ఇచ్చానని, మిగతా లక్ష రూపాయలతో నగరానికి వచ్చానని ఆమె వివరించింది.

సదరు మొత్తాన్ని అధికారులు ఆమె పేరిట ఎస్‌బీఐ బ్యాంకులో ఖాతా తెరచి అందులో జమ చేశారు. వివరాలు సేకరించిన జైలు అధికార సిబ్బంది వృద్ధురాలు పెంటమ్మ కోడలితో మాట్లాడి మరిన్ని వివరాలను సేకరించారు. సోమవారం వారు ఆనందాశ్రమానికి చేరుకునే అవకాశం ఉంది.

#BeggarFreeCityHyderabad #BeggarFreeHyderabad #BeggarFreeCityInIndia