మహేష్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ …!

మహేష్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్?????

Teja Bellamkonda

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్,కాజల్ జంటగా తేజ దర్శకత్వం లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.మొదటి నుంచి కొత్త వాళ్లతోనే సినిమాలు చేసిన తేజ ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు తో నిజాం సినిమా తీశాడు.ఈ సినిమా పెద్దగా ఆడలేదు.కానీ తేజ మహేష్ ను ప్రెసెంట్ చేసిన విధానం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.సినిమా లో మహేష్ చేసిన సీతారాం పాత్ర ప్రేక్షకులలో గుర్తుండిపోయింది.

Teja-Bellamkonda-Sai-Sreenivas

 

ప్రస్తుతం తేజ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా లో కూడా హీరో పేరు సీతారాంమేనట.ఈ సినిమా కి తేజ గత సినిమా “నేనే రాజు నేనే మంత్రి” కూడా ఇన్స్పిరేషన్ అని తెలుస్తుంది.

bellam-konda-srinivas

“నేనే రాజు నేనే మంత్రి” సినిమా లో హీరో రానా పేరు జోగేంద్ర.తన భార్యా మీద ఉన్న ప్రేమ తో తన పేరు రాధా ను జోడించి “రాధాజోగేంద్ర” అని పిలిపించుకుంటాడు.ఈ సినిమా లో హీరో పేరు ‘రామ్’ ఐతే హీరోయిన్ పేరు సీత కాబట్టి తన పేరు  కలిసి వచ్చేలా “సీతారాం”అని పెట్టాడు ఈ సినిమా లో సాయి శ్రీనివాస్ ఒక సమానమైన పాత్రలో కనిపిస్తాడు సినిమా లో హీరో లాగా కాకుండా ఒక పాత్ర లాగా మాత్రమే సాయి శ్రీనివాస్ చేస్తున్నాడు అని సమాచారం.శరవేగం గా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఈ సంవత్సరం లాస్ట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.మరి తేజ ఈ సినిమా తో హిట్ కోడతాడో లేదో చూడాలి