ఒక మెట్టు దిగిన బెల్లంబాబు ……!

బెల్లం బాబు అలియాస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ యంగ్ హీరో, టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి నుంచి కూడా భారీ సినిమాలనే చేస్తూ వచ్చాడు . తన మొదటి సినిమా నుండి ఈ మధ్య రిలీజ్ అయిన సాక్ష్యం వరకు అన్ని సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ తో జోడీ కట్టాడు.

ఒక స్టార్ హీరో సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో .. ఆ స్థాయిలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు తెరకెక్కుతూ వస్తున్నాయి. కానీ ఆయనకున్న మార్కెట్ పరంగా చూస్తే అన్ని సినిమాలు నష్టాలనే మిగిల్చాయి. అయన మార్కెట్ కంటే ఎక్కువ పెట్టి సినిమా తీయడం ఒక సాహసమే అని చెప్పవచ్చు . కానీ వస్తున్నా భారీ నష్టాలని చుసిన బెల్లంకొండ సురేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

ఇకపై శ్రీనివాస్ తో పెద్ద సినిమాలు చేయించకుండా, కంటెంట్ వున్న చిన్న సినిమాలు చేయించాలనే నిర్ణయానికి నిర్మాత బెల్లంకొండ వచ్చినట్టు సమాచారం. కొత్త దర్శకుల దగ్గర సిద్ధంగా వున్న కథలను వరుసబెట్టి బెల్లంకొండ వింటున్నాడట. కంటెంట్ కొత్తగా వుందనిపిస్తే సెట్స్ పైకి పంపించేస్తాడన్న మాట. దీనిని బట్టి బెల్లంకొండ శ్రీనివాస్ కొంతకాలం పాటు కొత్త దర్శకులతో చిన్న సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుంది.