కడపలో భారతీయుడు 2

కడపలో భారతీయుడు 2

kamal haasan biography

కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన చిత్రం ఇండియన్.1996లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా  తెలుగులో భారతీయుడు పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కి సీక్వెల్‌ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించనుండగా, కథానాయికగా నయనతార నటించనుంది

Also Read:——ఎన్టీఆర్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ముఖ్యఅతిధి గా బాబాయ్

kamal

ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి లైకా ప్రొడక్షన్స్ సంస్థ సన్నాహాలు చేస్తున్నది. శంకర్  2.ఓ కి కూడా వీరే నిర్మాతలు.ఐతే శంకర్  ప్రస్తుతం 2.ఓ నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ భారతీయుడు-2 కోసం కెమెరామెన్ రవివర్మన్‌తో కలిసి లొకేషన్‌లను అన్వేషిస్తున్నారు. కడపలోని గండికోట లో ఈ సినిమా  కోసం ప్రత్యేకమైన సెట్‌ని వేయించి,అక్టోబర్ నుంచి చిత్రీకరణ మొదలుపెట్టాలని దర్శకుడు శంకర్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

Also Read:—–కూరగాయలు అమ్ముతున్న స్టార్ హీరోయిన్!!!!!