కేసీఆర్ కు షాక్ ఇచ్చిన పార్టీ… కూటమికి మద్దతు

telangana latest politics,telangana news,telangana politics,trendingandhra

తెలంగాణా ఎన్నికలకు బీజేపీ తో రహస్య ఒప్పందం చేసుకుని ఎంఐఎం తో పొత్తు పెట్టుకుని వెళ్తున్న టీఆర్ఎస్ కు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. ఎలాంటి షరతులు లేకుండా టికెట్లు కూడా ఆశించకుండా మ‌హాకూట‌మిలో చేరి ముస్లిం లీగ్ పార్టీ తన మద్దతు ప్రకటించింది. ఇప్ప‌టికే మ‌హా కూట‌మి దెబ్బ‌కు అత‌లాకుత‌లం అయిపోతున్న అధికార పార్టీకి ముస్లిం లీగ్ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించటంతో మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.ఆల్‌ ఇండియా ముస్లిం నేషనల్‌ లీగ్‌ పార్టీ కూటమికి తన మద్దతు ప్రకటించింది. హిందు ఓట‌ర్ల‌ను బీజేపీ, ముస్లిం ఓట‌ర్ల‌ను ఎంఐఎం మోసం చేస్తూ టీఆర్ఎస్ తో క‌లిసి అంత‌ర్గ‌త ఒప్పందం చేసుకోవ‌డం వల్లే దానిని విబేధిస్తూ ముస్లిం లీగ్ పార్టీ కాంగ్రెస్ కు తన మద్దతు అని తెలిపింది.గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ జాతీయ నేత ఆర్‌సీ కుంతియా తో ముస్లిం లీగ్ నాయకుడు అబ్దుల్ ఘనీ స‌మావేశం అయ్యారు. బేషరతుగా మద్దతు తెలిపారు.
ఎంఐఎం ముస్లింల పార్టీ కాద‌ని ఒవైసీల పార్టీ అని, హైద‌రాబాదు ముస్లింలు ఎదిగితే ఎప్ప‌టికీ త‌మ మాట విన‌ర‌ని… వారిని అభివృద్ధి చెంద‌నీయ‌కుండా చేసే ఏకైక పార్టీ ఎంఐఎం పార్టీ అన్న ముస్లిం లీగ్ నాయకుడు అబ్దుల్ ఘనీ అలాంటి పార్టీతో హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ ర‌హ‌స్య ఒప్పందం చేసుకోవ‌డం… ఈ దేశ ప్ర‌జ‌ల‌కు ప‌ట్టిన క‌ర్మ అన్నారు.బీజేపీ, తెరాస, ఎంఐఎం మధ్య అంతర్గత ఒప్పందం మహా ప్ర‌మాద‌మ‌ని చెప్పిన ఆయన ముస్లిమ్స్ ఎంఐఎంమోసపోకుండా ఓటు వెయ్యాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. ఇచ్చిన హామీలకు తగిన నిధులు కేటాయించలేదన్నారు. ముస్లింలను మభ్యపెట్టే కేసీఆర్ పార్టీ ని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.