హీరో శివాజీ మీద బీజేపీ భౌతిక దాడి !

ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆంధ్రాలో వివాదాలు చెలరేగుతున్నాయి.. నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ‘టీవీ9’ విజయవాడలో చర్చ చేపట్టింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలు, ప్రజాసంక్షేమ సంఘాల నేతలు హాజరై తమతమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఈ చర్చలో హోదాపై శివాజీ మాట్లాడారు.. బీజేపీ చేసిన ద్రోహం మీద శివాజీ నిప్పులు చెరిగారు..

నటుడు శివాజీ మాట్లాడుతుండగా చర్చలోకి చొరబడ్డారు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ కార్యకర్తలు ఆయనపై భౌతికదాడికి దిగారు.. “మోదీ జీరో… మోదీ జీరో” అంటూ శివాజీ నినాదాలు చేశారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు కల్పించుకుని “శివాజీ డౌన్ డౌన్” అని నినాదాలు చేశారు. ఆపై బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా శివాజీపై పడటంతో, అక్కడే ఉన్న ప్రజా సంఘాలు, ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు..అలాగే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

shivaajuశివాజీ ఆగ్రహంతో ప్రజలు మిమ్మల్ని ఇంకా మాట్లాడనిస్తున్నారు. ఇంకా ఇదే పరిస్థితి ఉంటే తరిమి కొడతారని హెచ్చరించారు.