రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే దుర్మరణం

భారతీయ జనతా పార్టీ కి చెందినా ఎమెల్యే ఒకరు మృతి చెందడం ఆ పార్టీ శ్రేణుల్లో విషాదాన్ని నింపింది.

వివరాలలోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని సితార్‌పూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్రసింగ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లోకేంద్రసింగ్ అక్కడికక్కడే మృతి చెందారు.

కారు హైవే మీద ట్రక్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లోకేంద్రసింగ్ సహా ఇద్దరు గన్‌మెన్లు మృతి చెందారు. అదేవిధంగా ట్రక్ డ్రైవర్ కూడా సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. లోకేంద్రసింగ్ (41), బిజ్నూర్ జిల్లా నూర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లోకేంద్ర సింగ్ నూర్పూర్ నుండి గెలిచారు.