తెలంగాణ ప్రభుత్యానికి షాక్ ఇచ్చిన కేంద్రం ..

తెలంగాణ ప్రభుత్యానికి కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేబట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. పోలవరానికి జాతీయ హోదా కలిపించి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని టీఆర్ఎస్ ఎంపీల నిరసన తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు ఆ హోదా ఇచ్చామని, భవిష్యత్తులో మరే ప్రాజెక్టుకు అలాంటి హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. దీనితో టీఆర్ఎస్ ఎంపీలు మంత్రి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్, లోక్‌సభలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో మంత్రి గడ్కరీకి లేఖ రాస్తూ ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లుగా చేస్తున్న అభ్యర్థనను విస్మరించొద్దని విజ్ఞప్తి చేశారు. ఏ విభజన చట్ట ప్రకారం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారో, అదే చట్టంలో కాళేశ్వరం గురించి కూాడా ప్రస్తావించారని పేర్కొన్నారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.