పెళ్ళికొడుకు అదృశ్యం…

కొన్నీ గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు ఆచూకీ లేకుండా పోయాడు. పెళ్లి బాజాలు మ్రోగాలిసిన ఇంట్లో నిశబ్ద వాతావరణం నెలకుంది.. ఈ సంఘటన విజయవాడ లో చిట్టినగర్ లో జరిగింది. దీనిపై కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమో దైంది.
ఇక వివరాలలోకి వెళితే గొల్లపాలెం గట్టు రోడ్డుకు చెందిన పసుపులేటి కృష్ణారావు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఆయన రెండో కుమారుడు పి.జె.నాగేంద్రబాబు మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అతడికి పాతరాజరాజేశ్వరి పేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయ మైంది. గురువారం వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. 14వ తేదీన శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లిన నాగేంద్రబాబు బుధవారం వరకు తిరిగి ఇంటికి రాలేదు. దీనిపై ఆందోళన చెందిన అతని తండ్రి కృష్ణారావు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.