మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మర్కెట్స్ …!

sensex ,Stock market

వరుసగా రెండో రోజు కూడా దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను చూశాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా మళ్లీ సుంకాలు విధించడంతో ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది . ఇది దేశీయ మార్కెట్లనూ కూడా తాకింది. దీనితో ప్రారంబం నుండే సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొంటూ వచ్చాయి.

దీనికి తోడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం కూడా మార్కెట్‌ ను బాగా దెబ్బతీసింది. ఈ పరిణామాల మధ్య చివరి గంటల్లో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. సెన్సెక్స్‌ దాదాపు 300 పాయింట్లు పతనమవగా, నిఫ్టీ కీలక 11,300 మార్క్‌ను కోల్పోయింది.

నేటి మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 295 పాయింట్లు నష్టపోయి 37,291 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు పతనమై 11,379 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనమై 72.76గా కొనసాగుతోంది.