సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ నిజమే అంటున్న భరద్వాజ్..!

ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీ లో ఛాన్సులకోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్,నిర్మాతల నుండి హీరోస్ నుండి వేధింపులను ఎదురుకుంటున విషయం మనం చూసాం.కానీ ఇపుడు ట్రెండ్ మారింది అమ్మాయిలే సినిమా లో ఛాన్స్ కోసం,మీరు ఛాన్స్ ఇస్తే నేను బెడ్ రూమ్ కి వస్తాను అని కొంత మంది నటీమణులే అంటున్నారు

దశాబ్దాల కిందట తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను కూడా ఇటీవల పలువురు నటీమణులు బయటపెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమపై కూడా కొందరు సంచలన ఆరోపణలు చేశారు.

ఇప్పటి వరకూ సినీ పరిశ్రమలో నిర్మాతల నుంచి హీరోల నుంచి వేధింపులను ఎదుర్కొన్నాం అని ప్రకటించిన హీరోయిన్లను చాలా మందిని చూశాం. వ్యక్తుల పేర్లు చెప్పకుండా తమను ఒక హీరో బెడ్రూమ్ కు రమ్మన్నాడని, తాము నిర్మాతల నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని వివరించిన వాళ్లు చాలా మందే ఉన్నారు.

వాళ్ల సంగతలా ఉంటే ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యానాలు సంచలనంగా మారాయిప్పుడు. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అయిన ఈమె ఏమంటోందంటే.. కొంతమంది హీరోయిన్లే సెక్సువల్ ఫేవర్ చేయడానికి రెడీగా ఉంటారు అని! ఆ హీరోయిన్లే ఈ ప్రతిపాదన తెస్తారు అని ఏక్తా చెబుతోంది.

‘మీ సినిమాలో అవకాశం ఇస్తే.. నేను బెడ్రూమ్ కు రావడానికి సిద్ధం..’ అని కొంతమంది నటీమణులే ప్రతిపాదిస్తారని ఏక్తా చెబుతోంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు.. ఇలా చాలా మందికి ఇలాంటి ఆఫర్లు వస్తాయని ఏక్తా కపూర్ చెప్పింది.

క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేసే హీరోయిన్ల నడుమ, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉంటాయనే అభిప్రాయాల నడుమ ఏక్తా వ్యాఖ్యానాలు సంచలనంగా మారాయి. ఇలాంటి విషయాల్లో ప్రతిసారీ ఆడవాళ్లనే అనగా హీరోయిన్లనే బాధితులుగా చూడనవసరం లేదని కూడా ఏక్తా స్పష్టం చేశారు.ఇదే విషయం పై తమ్మారెడ్డి భరధ్వాజ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు.