షేడ్స్‌‌ ఆఫ్‌ సాహో పై ప్రముఖుల ప్రశంసలు …..!

shades of sahoo,sahoo,trendingandhra

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ బాహుబలి తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధాకపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నేడు (మంగళవారం) ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా నుండి మేకింగ్‌ వీడియోను ‘షేడ్స్‌‌ ఆఫ్‌ సాహో-1’ పేరుతో విడుదల చేశారు. ఇందులో భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన తీరును చూపించారు. ఇందులో ప్రభాస్‌ చాలా స్టైలిష్‌గా కనిపించారు. దీన్ని చూసిన సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు .

SAHOO ,trendingandhra

వాటిల్లో కొన్ని …..

పరుచూరి గోపాలకృష్ణ: ‘ఈశ్వర్‌గా, మా కలం పుత్రుడిగా వెండితెరమీద అడుగుపెట్టి, అభిమానుల ప్రేమ వర్షంలో తడిసి, ఛత్రపతిగా అలరించి, రికార్డుల బాహుబలిగా తిరుగులేని స్థానం సంపాదించుకున్న మా ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ‘సాహో’ వీరపుత్ర. ఆల్‌ ది బెస్ట్‌’.

వెన్నెల కిశోర్‌: ‘‘సాహో’ మేకింగ్‌ చాలా ఉత్కంఠ భరితంగా ఉంది. చివరి 22 సెకన్లు అద్భుతం’.

శోభూ యార్లగడ్డ: ‘‘సాహో’ టీజర్‌ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంది. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’.

రానా: ‘సాహో..రే..’.

రామజోగయ్య శాస్త్రి: ‘సూపర్‌, డూపర్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ ‘సాహో’ టీజర్‌ ఇదిగో. ‘బాహుబలి’ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. నీ పనితీరు గొప్పగా ఉంది సుజీత్‌. ఇలాగే పెద్ద పెద్ద కలలు కంటూ ఉండండి’.

మారుతి: ‘వాహ్‌.. తొలి ఛాప్టరే ఇలా ఉంటే.. మీ లుక్‌ చాలా బాగుంది ప్రభాస్‌ గారు. భవిష్యత్తులో పెద్ద విజయం అందుకోబోతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు. సుజీత్‌, యూవీ క్రియేషన్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌’.

అల్లు శిరీష్‌: ‘వావ్‌.. వావ్‌.. వావ్‌.. అద్భుతమైన విజ్యువల్స్‌. తెలుగు సినిమా మరో మెట్టు ఎదిగింది. మొత్తం చిత్ర బృందానికి అభినందనలు’.

సుధీర్‌ వర్మ: ‘‘షేడ్స్‌‌ ఆఫ్‌ సాహో’ చూసి మాటలు రాలేదు. ఈ ఒక్క వీడియో ఇవాళ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది’.

సుమంత్‌: ‘ఉఫ్‌..’.

సురేందర్ రెడ్డి: ‘‘సాహో’కు గుడ్‌లక్‌’.

మనోజ్‌: ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో’ పగిలిపోయింది బాబాయ్‌. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’.

గోపీ మోహన్‌: ‘ప్రభాస్‌ అభిమానులకు యూవీ క్రియేషన్స్‌, సుజీత్‌ ఇచ్చిన పుట్టినరోజు కానుక అదిరింది. భారత చలన చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ యాక్షన్‌తో కూడిన సినిమా చూడటానికి సిద్ధంగా ఉండండి’.

ఈషా రెబ్బా: ‘‘సాహో’ వీడియో సూపర్‌గా ఉంది’.

అరుణ్‌ విజయ్‌: ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో’ బాగుంది‌.. చాలా నచ్చింది’.