చంద్రబాబు చెప్పినట్టు ఉచ్చులో పడ్డారా..?

 

chandra babu told that was in a trap, Trending Andhra

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నేతలు నిజంగానే వైకాపా ట్రాప్ లో పడ్డారా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇటీవల విశాఖ విమానాశ్రయంలో విపక్ష నేత జగన్ పై జరిగిన దాడి ఘటన అనంతరం అధికార విపక్షాల మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినపడుతుంది. అధికార పక్షం వైపు తప్పు లేకపోయినా కేంద్రం వైపున తప్పు స్పష్టంగా కనపడుతున్నా విపక్ష పార్టీ నేతలు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ని లక్ష్యంగా చేసుకుని జగన్ కి ప్రాణ హాని ఉంది అంటూ ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది అనే చెప్పుకోవచ్చు.

Image result for chandra-babu-

దీనితో తెలుగుదేశం నేతలు కూడా ఘటన జరిగిన నాటి పరిణామాలతో పాటు అనేక ప్రశ్నలు సంధిస్తూ అదే పనిలో ఉంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కడప జిల్లా పర్యటనకు వెళ్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. వైకాపా ఉచ్చులో పడవద్దు అని నేతలకు సూచించారు. దీనితో ఒక్కసారిగా దీనిపై చర్చ జరుగుతుంది. కాగా ఈ ఘటనపై వారు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.