నేడు ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం…!

టీడీపీ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10.30 గంటలకు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.మంత్రులు కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, ముఖ్యనేతలు సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మీటింగ్ లో ప్రధానంగా పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన నిరసన ల గురించి చర్చించనున్నారు.అలాగే ప్రత్యక హోదా విషయం కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.

అలాగే త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న కారణం గా అన్ని జిల్లా లో పార్టీ ని ఎలా ముందుకు తీసుకు పోవాలని చర్చించుకుంటారని సమాచారం.జగన్ చేసిన కామెంట్ ఫై కూడా ఈ సమావేశం లో చర్చకు రానున్నది.