బాబు ఢిల్లీ టూర్స్ ….. రహస్యం ఇదే …?

Babu Delhi Tours ..... This is the secret?,chandrababu naidu,chandrababu,nchandrababu naidu,trendingandhra

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దం అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చి సరిగ్గా మూడు రోజులు అయినా గడవక ముందే మళ్లీ మరో పర్యటనకు రెడీ అవుతుండటం విశేషం. ఇంతకీ ఇప్పుడు బాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నాడు అంటే..బీజేపీ వ్యతిరేక వర్గాన్ని కూడగట్టడానికి అట.

ఇలా చెప్పుకుంటూ మరోసారిచంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నాడు. మరి చేసేది ఇలా రాజకీయం కోసం అయినా చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ముతోనే ఈ పర్యటనలు చేపడుతున్నాడు అనేది సుస్పష్టం. ప్రజల సొమ్ముతో తన రాజకీయాన్ని చేస్తూ ఉంటాడు చంద్రబాబు.

మొన్నటి వరకూ బీజేపీ వాళ్లను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు వరసగా ఢిల్లీ పర్యటనలకు వెళ్లాడు.ఏకంగా నలబై సార్లకు పైగా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళాడు . అన్ని సార్లు టూర్లు వేసి అప్పట్లో బీజేపీ నేతలక సాష్టాంగపడేవాడు. రాష్ట్రానికి ఏవేవో సాధించుకు వస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాడు. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీ మోసం చేసిందని అంటున్నాడు. నాలుగున్నరేళ్లకు గానీ చంద్రబాబుకు ఈ విషయం తెలియరాలేదు.

ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు అంటే.. ఇక్కడి వ్యవహారాలను డైవర్ట్ చేసేందుకే అని చెప్పనక్కర్లేదు. ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది. ఆ అంశం లో బాబు మీదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అయితే దాన్ని డైవర్ట్ చేయడానికి బాబు ఇలావరసగా ఢిల్లీ ప్రయాణాలు పెట్టుకుంటున్నాడనే మాట వినిపిస్తోంది.

#Chandrababu #ChandraBabuNaidu #NChandraBabuNaidu #ChandraBabuDelhiToursThisIsTheSecret