జగన్ పై దాడి లో ఏ 1 చంద్రబాబే …..!

chandrababu ,trendingandhra

వైజాగ్ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై నిన్న దాడి జరగడం పోలీసుల వైఫల్యమేనని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.ఈ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేదని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎయిర్ పోర్టులో రక్షణ కల్పించడం తమ బాధ్యత కాదని, అది కేంద్ర ప్రభుత్వ అంశమని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన ఖండించారు.

yv subba reddy,trendingandhra

ఎయిర్పోర్ట్ మన పరిధిలో లేదు అన్నప్పుడు వైజాగ్ లో ఏడాది క్రితం కొవ్వొత్తుల ర్యాలీ చేయడానికి వచ్చిన జగన్ ను విమానాశ్రయం రన్ వే పై ఏపీ పోలీసులు ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు. తమను 8 గంటలపాటు విమానాశ్రయం రన్ వేపై అడ్డగించిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఆ రోజు ఎయిర్ పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందా అని బాబు కి చురకాలు అంటించాడు .

జగన్ పై దాడి జరిగిన అనంతరం నిందితుడిని పట్టుకుని వెళ్లింది కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులేనని తెలిపారు. జగన్ పై దాడి కేసులో ఏ1 నిందితుడిగా సీఎం చంద్రబాబు, ఏ2 నిందితుడిగా రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ లు ఉన్నారన్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా జగన్ రక్త నమూనాలపై రిపోర్టు వస్తుందనీ, అది అందుకున్న అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంటికి వెళతారని పేర్కొన్నారు.