గెలుపు గుర్రాలకే టికెట్స్ ….తేల్చి చెప్పిన చంద్రబాబు ..!

chandrababu naidu , trendingandhra
రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగరాలని.. ప్రతి ఇంటి తలుపుపైనా పార్టీ స్టిక్కర్‌ ఉండాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోధించారు. మిషన్‌-2019 ఎలక్షన్‌ మన లక్ష్యం కావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం కావాలని ఆకాక్షించారు. గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తామని ప్రకటించారు. మిగిలినవారిని వేరే విధంగా ఉపయోగించుకుంటామని తెలిపారు.
chandrababu,trendingandhra
 
పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌లు, పార్టీ నాయకులతో బుధవారం ఆయన టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ‘ఇప్పుడు టీడీపీకి 64 లక్షల మంది సభ్యత్వం ఉంది. ఈ నెల 31 నుంచి అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు ముమ్మరం చేయాలి. ఈసారి సభ్యత్వం కోటికి చేరాలి. మన బలగమంతా కార్యకర్తలే. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో అనేక సమస్యలు చుట్టుముట్టాయి. అన్నిటినీ పట్టుదలగా అధిగమించాం’ అని తెలిపారు.
 

chandrababu naidu,trendingandhra

తితలీ తుఫాను నష్టం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ‘మీమీ పరిధుల్లో మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉపయోగించాలో అక్కడ వినియోగించుకుంటాం. ఎవరికి అప్పజెప్పిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలి. రాష్ర్టాభివృద్ధే మనందరి లక్ష్యం కావాలి’ అని పేర్కొన్నారు. ఓటర్ల నమోదుపై అందరూ శ్రద్ధపెట్టాలని, బూత్‌ కన్వీనర్ల నియామకం వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

‘లౌకికవాదం ప్రమాదంలో పడింది. సమాజంలో అశాంతి, అభద్రత ఏర్పడ్డాయి. బీజేపీ పద్ధతి లేని రాజకీయాలకు పాల్పడుతోంది’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. జాతీయస్థాయిలో టీడీపీ క్రియాశీలం కావాలన్నారు. ‘ఒకవైపు కేంద్రం నుంచి కాచుకోవాలి. మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికేదైనా గెలుపు మనదే కావాలి’ అని దిశానిర్దేశం చేశారు.

#ChandrababuNaiduAnnouncedMLATicketsforSelectedCandidates #Elections #Chandrababu