కడప కి వెళ్లనున్న బాబు ….ఇంటిలిజెన్స్ హెచ్చరిక …!

ChandrababuNaidu,ChandraBabu,NChandrababuNaidu,Kadapa,Trendingandhra

రాష్ట్ర విభజన హామీల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న ధర్మపోరాట దీక్షలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరు వెళ్తున్నారు. ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడి జరగడం.. ఇది సీఎం కనుసన్నుల్లో జరగిందని.. అలాగే ప్రతిపక్షనేతపై దాడిపై చంద్రబాబు స్పందన సరిగా లేదంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో జగన్ సొంత జిల్లాలో ముఖ్యమంత్రి అడుగుపెడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు భద్రతను పెంచాలని.. ఆయన పర్యటించే మార్గాల్లో తనిఖీలు చేపట్టాలని ఇంటెలిజెన్స్ కడప జిల్లా పోలీస్ యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. సీఎం మధ్యాహ్నం 12.45 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 1.35 గంటలకు హెలికాఫ్టర్‌లో ప్రొద్దుటూరుకు వెళతారు. తొలుత గండికోట ప్రాజెక్ట్ పైలాన్‌ను ఆవిష్కరించి సభకు వెళతారు.

#ChandrababuNaidu #ChandraBabu #NChandrababuNaidu #Kadapa #ChandrababuNaiduToGoToKadapaIntelligenceWarning