చంద్రబాబు స్వరం మార్చేసారు

chandrababu,trendingandhra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన స్పందించిన విధానంపై ఇప్పుడు అనేక చర్చలు జరుగుతున్నాయి. తొలిసారి గవర్నర్ అధికారాలను ఆయన గట్టిగానే ప్రశ్నించారు.అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఆయన కుమారుడు కుమార్తె కవిత, కేంద్ర మంత్రి, పవన్ కళ్యాణ్ ఇలా స్పందించిన అందరిపై గట్టిగానే వ్యాఖ్యలు చేసారు చంద్రబాబు. గతంలో ఎప్పుడు చంద్రబాబు నుంచి ఈ స్థాయిలో ప్రతి ఘటన రాలేదు. అలాగే మీడియాపై కూడా విసుర్లు విసిరారు. అటు జగన్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోయారు అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ వెళ్ళడం అక్కడ స్పందించిన వ్యక్తుల విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఎలా ఉన్నా ఇది జగన్ సెల్ఫ్ గోల్ అని చంద్రబాబు మీడియా సమావేశం తర్వాత అందరికి స్పష్టంగా అర్ధమైనట్టే కనపడుతుంది.

#ChandrababuReactionOverAttackOnYsJagan #YSJagan #Chandrababu