నన్ను తక్కువగా అంచనా వేయొద్దు….

chandrababu , trendingandhra

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి అనంతరం ఏపీలో జరుగుతున్న పరిణామాలు తెలిసిందే. ఈ కుట్రకు తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

chandrababu naidu,trendingandhra

అమరావతిలో నిన్న సాయంత్రం జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు. రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారు’ అని చెప్పుకొచ్చారు . ఇదిలా ఉండగా, ఈ రోజు ఉదయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీకి కేంద్రం సాయం చేయకపోవడం, జరుగుతున్న ఐటీ దాడులు, జగన్ దాడి ఘటన, గవర్నర్ తీరు తదితర అంశాలపై ముందుగా ఏపీ భవన్ లో టీడీపీ ఎంపీలతో ఆయన చర్చించనున్నారు . ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

#ChandrababuSensationalCommentsOnOppositionsAllegations #Chandrababu #Jagan